Birkur: మానవత్వానికి మారుపేరు: ఒకేసారి ఆరుగురు స్నేహితుల రక్తదానం
Birkur: బీర్కూర్ మండలం బైరాపూర్ గ్రామానికి చెందిన గంగవ్వ ఆపరేషన్ కోసం గంపాల విఠల్ మరియు ఆయన ఐదుగురు మిత్రులు ఒకేసారి రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు.
Birkur: మానవత్వానికి మారుపేరు: ఒకేసారి ఆరుగురు స్నేహితుల రక్తదానం
Birkur: వృద్ధురాలి ఆపరేషన్‌కు ఆరుగురు స్నేహితులు రక్తదానం చేసి ఆపదలో ఉన్న వృద్ధురాలికి ,రక్తం దానం చేసి,అందరికీ ఆదర్శంగా నిలిచారు. లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ సీతలే రమేష్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన కుటుంబ సభ్యులు.
ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడమే నిజమైన మానవత్వమని చాటిచెప్పారు బైరాపూర్ గ్రామానికి చెందిన గంపాల విఠల్, ఆయన స్నేహితులు. బీర్కూర్ మండలం బైరాపూర్ గ్రామానికి చెందిన గంగవ్వ అనే వృద్ధురాలికి ఎముక విరగడంతో బోధన్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆపరేషన్ కోసం బీ పాజిటివ్ (B+) రక్తం నాలుగు యూనిట్లు అవసరమయ్యాయి.
ఈ విషయాన్ని లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ సీతలే రమేష్ దృష్టికి తీసుకు పోగా, ముందుగా బంధువులు, స్నేహితులను సంప్రదించి రక్తదాతలను సమకూర్చుకోవాలని, అవసరమైతే తాను ఏర్పాటు చేస్తానని ఆయన భరోసా ఇచ్చారు. దీంతో గంపాల విఠల్ తన స్నేహితులను సంప్రదించగా, వారంతా రక్తదానం చేసేందుకు ముందుకొచ్చారు.
సీతలే రమేష్ పర్యవేక్షణలో, ప్రవీణ్ సహకారంతో రక్తగ్రూపులను నిర్ధారించుకుని విఠల్‌తో పాటు పీరయ్య, ప్రకాష్, నవీన్, సాయి కిరణ్, సాయి ప్రసాద్ నిజామాబాద్‌లోని బ్లడ్ బ్యాంక్‌కు వెళ్లి రక్తదానం చేశారు.
ఆపద సమయంలో స్పందించి రక్తదానం చేసిన తన స్నేహితులకు విఠల్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. రక్తదానం కోసం మార్గనిర్దేశం చేసి సహకరించిన సీతలే రమేష్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
“మన ఇంటి దాకా వస్తేనే రక్తం విలువ తెలుస్తుంది. రక్తదానం చేయండి.. ప్రాణాలను కాపాడండి” అని విఠల్ పిలుపునిచ్చారు.




