Banswada: నీటి సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలి: కమిషనర్ గోపు గంగాధర్

Banswada: బాన్సువాడ పట్టణంలో ప్రతిరోజూ నిర్ణీత సమయానికి అంతరాయం లేకుండా తాగునీటి సరఫరా అందించాలని మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ ఆదేశించారు.

SALEEM, BANSWADA
Published on: 2 Nov 2026 7:23 PM IST
Banswada
X

Banswada: నీటి సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలి: కమిషనర్ గోపు గంగాధర్

బాన్సువాడ: బాన్సువాడ పట్టణ ప్రజలకు ప్రతిరోజూ నిరంతరాయంగా, సక్రమంగా సమయానికి త్రాగునీటి సరఫరా అందించేందుకు గాను, నీటి సరఫరా విభాగంలో విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని బాన్సువాడ పురపాలక సంఘం కమిషనర్ సూచించారు.

ఈ సందర్భంగా కమిషనర్ నీటి సరఫరా సిబ్బందికి పలు సూచనలు జారీ చేస్తూ, పట్టణంలోని అన్ని వార్డులకు నిర్ణీత సమయానికి సక్రమంగా నీటి సరఫరా జరిగేలా తగిన చర్యలు చేపట్టాలని ఈ క్రింది ముఖ్య విషయాలను సూచించారు.

1) నీటి సరఫరా పైపులైన్లను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ, ఎక్కడైనా లీకేజీలు గుర్తించిన వెంటనే మరమ్మతులు చేపట్టాలి.

2) పైపులైన్ లీకేజీల కారణంగా త్రాగునీరు వృథాగా పోకుండా తక్షణ చర్యలు తీసుకోవాలి.

3) మోటార్లు, పంప్ హౌస్‌లు, వాల్వులు మరియు ఇతర నీటి సరఫరా పరికరాలను నిరంతరం పర్యవేక్షించాలి.

4) నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడే అవకాశం ఉన్నప్పుడు ముందస్తు జాగ్రత్తలు తీసుకొని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి.

5) నీటి సరఫరాకు సంబంధించిన ప్రజల ఫిర్యాదులను వెంటనే స్వీకరించి పరిష్కరించాలి.

6) నీటిని పొదుపుగా వినియోగించుకునేలా పట్టణం లోని అన్ని వార్డుల ప్రజలకు అవగాహన కల్పించాలి. త్రాగునీటిని ఇతర అవసరాలకు వృథా చేయకుండా ప్రజలకు సూచించాలని తెలియజేసారు.

కావున నీటి సరఫరా విభాగం సిబ్బంది పై సూచనలను తప్పనిసరిగా పాటిస్తూ, బాన్సువాడ పట్టణ ప్రజలకు నిరంతరాయంగా త్రాగునీటి సరఫరా అందేలా సమన్వయంతో పనిచేయాలని కమిషనర్ ఆదేశించారు.విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే, బాధ్యుల పై చర్యలు తప్పవని హెచ్చరించారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA