Kamareddy: కామారెడ్డి 177 ధాన్యం కొనుగోలు కేంద్రాలు డ్వాక్రా మహిళలకు కేటాయింపు!
Kamareddy: బాన్సువాడ పులికుచ్చ తాండాలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన DRDA PD దామోదర్ రెడ్డి. జిల్లాలో 177 కేంద్రాలను డ్వాక్రా సంఘాలకు కేటాయింపు.
Kamareddy: కామారెడ్డి 177 ధాన్యం కొనుగోలు కేంద్రాలు డ్వాక్రా మహిళలకు కేటాయింపు!
Kamareddy: కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం లోని పులికుచ్చ తాండా లో వరి కొనుగోలు కేంద్రాన్ని ఈ రోజు DRDA,IKP,PD దామోదర్ రెడ్డి ప్రారంభించారు.డ్వాక్రా సంఘాలు ఆర్థికంగా బలపడాలని,సహకార సంఘాల పరిధిలో కొన్ని వారి కొనుగోలు కేంద్రాలను,ప్రభుత్వం మహిళా సంఘాలకు కేటాయించిందని అన్నారు.
జిల్లాలోమొత్తం 177 ధాన్యం కొనుగోలు కేంద్రాలను డ్వాక్రా సంఘాలకు కేటాయించినట్లు PD దామోదర్ రెడ్డి తెలిపారు. అందులో బాన్సువాడ లో 08, జుక్కల్ 44, కామారెడ్డి లో 51, ఎల్లారెడ్డి లో 74 ,ఈ విధంగా మొత్తం 177 కేంద్రాలు మహిళలకు కేటాయించినట్లు ఆయన తెలిపారు. వీటి ద్వారా ధాన్యం కొనుగోలు ద్వారా వచ్చే ఆదాయం తో మహిళా సంఘాలు ఆర్థికంగా ఎదగటానికి ఉపయోగ పడతాయని పీ డీ అన్నారు. రైతులు తాము కష్టపడి పండించిన వారి ధాన్యం ను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవాలని సూచించారు.దళారులకు అమ్ముకుని మోసపోవద్దని రైతులకు సూచించారు.ధాన్యం అమ్మిన మూడు రోజుల్లోనే తమ ఖాతాలో డబ్బులు వస్తాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో MPDO ఆనంద్ కుమార్,సర్పంచ్ధరావత్ శ్రీనివాస్,మాజీ సర్పంచ్ పీర్సింగ్,నాయక్ దేవి,బాపు రెడ్డి,మోహన్ రెడ్డి, బోడా రూప్సింగ్,ధారావత్ చోక్లా, ఖట్రూత్ రూప్యా,బోద విఠల్,వసంత్ కుమార్,రాంపూర్ సర్పంచ్ మల్లు గోండ,GP సెక్రటరీ శ్రీహరి రెడ్డి.




