Nizamabad: క్షయ వ్యాధిగ్రస్తులకు పోషకాహార కిట్ల పంపిణీ: డాక్టర్ రాజశ్రీ!

Nizamabad: నిజామాబాద్ జిల్లాలో క్షయ వ్యాధిగ్రస్తులకు జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజశ్రీ ఆధ్వర్యంలో ప్రభుత్వం అందించిన అధిక పోషకాహార కిట్లను పంపిణీ చేశారు.

M. RAMESH,NIZAMABAD
Published on: 6 Oct 2026 11:02 PM IST
Nizamabad
X

Nizamabad: క్షయ వ్యాధిగ్రస్తులకు పోషకాహార కిట్ల పంపిణీ: డాక్టర్ రాజశ్రీ!

Nizamabad: క్షయ వ్యాధితో బాధపడుతున్న రోగులకు ప్రభుత్వం అందిస్తున్న అధిక పోషకాహార కిట్లను పంపిణీ చేశారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజశ్రీ చేతుల మీదుగా ఈ కిట్లను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజశ్రీ మాట్లాడుతూ... క్షయ వ్యాధి నయం కావడానికి మందులతో పాటు పోషకాహారం చాలా ముఖ్యమని, ప్రభుత్వం అందిస్తున్న ఈ పోషకాహార కిట్లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

క్షయ వ్యాధి సోకిన వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తినాల్సిన ఆహారం గురించి రోగులకు తగు సూచనలు, సలహాలు ఇచ్చారు.పోషకాహారం తీసుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరిగి త్వరగా కోలుకుంటారని వైద్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇందల్వాయి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సుశాంత్ రెడ్డి, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ ఆరోగ్య సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.

M. RAMESH,NIZAMABAD

M. RAMESH,NIZAMABAD