Banswada: సోమేశ్వర్ గ్రామంలో జీసీబీ యంత్రంతో డిస్ట్రిబ్యూటర్ కాలువ పూడిక తొలగింపు!

Banswada: కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం సోమేశ్వర్ గ్రామంలో సర్పంచ్ వీరేశం ఆధ్వర్యంలో డిస్ట్రిబ్యూటర్ కాలువలో పూడిక తీసి, సాగునీటి సౌకర్యం కల్పించారు.

SALEEM, BANSWADA
Published on: 3 Oct 2026 1:04 PM IST
Banswada
X

Banswada: సోమేశ్వర్ గ్రామంలో జీసీబీ యంత్రంతో డిస్ట్రిబ్యూటర్ కాలువ పూడిక తొలగింపు!

Banswada: కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం సోమేశ్వర్ గ్రామం లో 19 వ డిస్ట్రిబ్యూటర్ కాలువలో పేరుకుపోయిన పూడిక,పిచ్చిమొక్కలు ఈ రోజు జీ సీ బీ యంత్రం సహాయం తో సర్పంచ్ వీరేశం శుభ్రం చేయించారు. దేశాయిపేట్ చెరువు తూము నుండి, సోమేశ్వర్ దేవుని కుంట చెరువు వరకు పంట కాలువను శుభ్రంచేసి,దేవుని కుంట చెరువు కింద ఉన్న ఆయకట్టు రైతుల భూములకు సాగు నీరు అందించడానికి కృషి చేస్తున్నామని ఆయన అన్నారు.

వర్షా భావం తో పంటల కు నష్టo చేకూర కుండా,నీరు అందించేందుకు,దేవుని కుంట లో నీళ్ళు నిoపి ,నిలువ చేయనున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సోమేశ్వర్ సర్పంచ్ వీరేశం తో పాటు,మాజీ సర్పంచ్ భీమా గంగారాం, బయ్యాని కృష్ణ,చెంచు సాయిలు, బోప్పాని మొగులయ్యా,రైతులు పాల్గొన్నారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA