Renjal: కార్తీక పౌర్ణమి సందర్భంగా కందకుర్తి త్రివేణి సంగమానికి పోటెత్తిన భక్తులు!
Renjal: కార్తీక పౌర్ణమి సందర్భంగా రెంజల్ మండలం కందకుర్తి త్రివేణి సంగమానికి భక్తులు పోటెత్తారు. పుణ్యస్నానాలు ఆచరించి శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
Renjal: కార్తీక పౌర్ణమి సందర్భంగా కందకుర్తి త్రివేణి సంగమానికి పోటెత్తిన భక్తులు!
రెంజల్: రెంజల్ మండలం కందకుర్తి త్రివేణి సంగమం వద్ద కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. భక్తులు పవిత్ర నదీ తీరంలో పుణ్యస్నానాలు ఆచరించారు. నదిలో తెప్పలు వదులుతూ మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం నది ఒడ్డున ప్రసిద్ధ శివాలయంలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. భక్తుల కోసం సీతారాం త్యాగి మహరాజ్ ఆశ్రమం వద్ద అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.




