Jukkal: దళిత బంధు అక్రమాలపై విచారణ జరపాలి!
Jukkal: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జుక్కల్ నియోజకవర్గం నిజాంసాగర్ మండలంలో జరిగిన దళిత బంధు పంపిణీ అక్రమాలపై పూర్తి స్థాయి విచారణ జరపాలని టిఆర్ఎస్ (TRP) నాయకుడు బోర్గి సంజు హైదరాబాద్ ఏసీబీ డీజీకి ఫిర్యాదు చేశారు.
Jukkal: దళిత బంధు అక్రమాలపై విచారణ జరపాలి!
Jukkal: జుక్కల్ (కామారెడ్డి ) గత బి ఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం లో భాగంగా జుక్కల్ నియోజకవర్గం లో నిజాంసాగర్ మండలన్నీ పైలెట్ ప్రాజెక్ట్ గా ఎంపిక చేసి లబ్ధిదారులకు అందించిన యూనిట్ల పంపిణి పై అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని దీనిపై పూర్తి విచారణ కోరుతు టి ఆర్ ఎస్ పార్టీ దళిత విభాగం కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎం. సంజు బోర్గి బుధవారం అవినీతి నిరోధక శాఖ డి జి హైదరాబాద్ ను కలిసి పిర్యాదు చేశారు.
ప్రస్తుతం జుక్కల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు దళితుల ఓట్లతో గెలిచి మూడు సంవత్సరాలు గా ఎందుకు దళిత బంధులో విచారణ చేపట్టాలెదో జుక్కల్ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే ఆరోపణ చేశారు తను విచారణ జరిపించాలని కోరుతు ఏ సి బి కి పిర్యాదు చేశానని పేర్కొన్నారు.
భవిష్యత్ లో ఎస్సి రిజర్వేషన్ పై తప్పకుండ పోరాడుతనని సంజు పేర్కొన్నారు. బి ఆర్ ఎస్, కాంగ్రెస్ అవినీతి అక్రమాలపై ఒక్కొక్కటిగా బయట పెడ్తానని అన్నారు. ప్రజల పక్షాన నిలబడి నిత్యం వారి సమస్య లపై పోరాడుతున్నట్లు తన పోరాటానికి ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.




