Banswada: బాన్సువాడలో నాటు బాంబుల పేలుడు: ఏడుగురికి గాయాలు

Banswada: కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం తాడ్కోల్‌లో నాటు బాంబులు పేలి ముగ్గురు చిన్నారులు సహా ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి; నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.

SALEEM, BANSWADA
Published on: 1 Nov 2026 6:17 PM IST
Banswada
X

Banswada: బాన్సువాడలో నాటు బాంబుల పేలుడు: ఏడుగురికి గాయాలు

కామారెడ్డి జిల్లా: బాన్సువాడ మండలo తాడ్కోల్ గ్రామంలోని ఎర్రమల్ కుచ్చలో నాటు బాంబులు పేలాయి. 7 గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయాల పాలు అయిన వారి వివరాలు కడమంచి రమేష్,నక్కల పోతుల వైశాలి, సితరి కృష్ణ,లక్క పుత్ లక్ష్మణ్, దండ్ల రాజు,అంజలి,శ్రీ దేవి,అనే వారు గాయాల పాలయ్యారు. వారిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారు.

శ్రీదేవి, అంజలి, రమేష్, రాజు పరిస్తితి విషమంగా ఉంది.మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలించారు.అడవి పందుల వేట కోసం నాటు బాంబులు తయారు చేస్తున్నట్లు తెలుస్తుంది.పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA