Balkonda: నిజామాబాద్ బాల్కొండ మోడల్ స్కూల్లో అయ్యప్ప మాల వివాదం!
Balkonda: నిజామాబాద్ జిల్లా బాల్కొండ మోడల్ స్కూల్లో అయ్యప్ప మాల ధరించి రావద్దంటూ ప్రిన్సిపాల్ హెచ్చరించారని విద్యార్థులు గురువారం ఆరోపించారు.
Balkonda: నిజామాబాద్ బాల్కొండ మోడల్ స్కూల్లో అయ్యప్ప మాల వివాదం!
నిజామాబాద్ జిల్లా: నిజామాబాద్ జిల్లా బాల్కొండ మోడల్ స్కూల్లో వివాదం చోటుచేసుకుంది. అయ్యప్ప మాల ధరించి పాఠశాలకు రావడంపై ప్రిన్సిపాల్ శ్రీనివాస్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ, పాఠశాలకు రావద్దంటూ హెచ్చరించారని ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి భువన్, ఎనిమిదో తరగతి విద్యార్థి మాణితేజ్ ఆరోపిస్తున్నారు.
బడి బాట పట్టాల్సిన పిల్లలు మాతపరమైన విధించడమెంటి అని ప్రశ్నిస్తున్నారు. అయ్యప్ప మాల ధరించడం తమ తప్పా అంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా, గతంలో కూడా ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌పై పలు ఆరోపణలు ఉన్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. తాజాగా విద్యార్థులు చేసిన ఆరోపణలతో పాఠశాలలో నెలకొన్న పరిస్థితులపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
విద్యార్థుల మత విశ్వాసాలను గౌరవించాల్సిన బాధ్యత విద్యాసంస్థలపై ఉండాలంటూ ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు స్పందించి సమగ్ర విచారణ జరిపించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. విద్యార్థులు చేసిన ఆరోపణల్లో వాస్తవాలను కనుగొని బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.




