Banswada: రుద్రూర్‌లో సీఈసి జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో నిరసన!

Banswada: నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం రుద్రూర్‌లో సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.

SALEEM, BANSWADA
Published on: 6 Oct 2026 3:02 PM IST
Banswada
X

Banswada: రుద్రూర్‌లో సీఈసి జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో నిరసన!

Banswada: భారత రాజ్యాంగ విరుద్ధంగా, ప్రజాస్వామ్య విరుద్ధంగా ,బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న ప్రధాన ఎన్నికల అధికారి ఙ్ఞానేష్ కుమార్ రాజీనామా చెయ్యాలని, అధిష్టానం పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మంగళవారం రుద్రూర్ మండల కేంద్రంలో జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని, ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన చేపట్టారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ, తెలంగాణలో సుమారు 92 లక్షల ఓట్లను వివిధ కారణాలతో తొలగించారన్నారు.

ముస్లిం మైనారిటీ, ఆదివాసి గిరిజనులు, క్రిస్టియన్ల ఓట్లు అధికంగా గల్లంతయ్యాయని పేర్కొన్నారు. స్వతంత్రంగా పని చేయాల్సిన భారత ఎన్నికల సంఘం ప్రధానాధికారి బీజేపీకి ఏజెంటుగా మారారని వారు ఆరోపించారు. ఎస్ఐఆర్ పేరుతో బీజేపీ వ్యతిరేక ఓట్లను తొలగిస్తున్నారని మండిపడ్డారు. తొలగించిన ఓట్లను వెంటనే పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇందూరు చంద్రశేఖర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్, సర్పంచ్ ఇందూరు సునీత చంద్రశేఖర్, ఉప సర్పంచ్ నిస్సార్, రాణంపల్లి సర్పంచ్ కొండలవాడి శంకర్, జహిరాబాద్ పార్లమెంటు దిశ కమిటీ మెంబర్ నడిపింటి నగేష్, నాయకులు పత్తి రాము, పార్వతి ప్రవీణ్, కర్క అశోక్, మాజీ ఎంపీటీసీ గౌస్, కాసుల మహేష్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, సీపీఎం కార్యకర్తలు ,ప్రజలు పాల్గొన్నారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA