Kamareddy: ఇసనపల్లి శ్రీ కాలభైరవ స్వామిని దర్శించుకున్న దేవాదాయ కమిషనర్!

Kamareddy: కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఇసనపల్లిలోని శ్రీ కాలభైరవ స్వామి ఆలయాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

MADHU, KAMAREDDY
Published on: 25 Nov 2026 1:52 PM IST
Kamareddy
X

Kamareddy: ఇసనపల్లి శ్రీ కాలభైరవ స్వామిని దర్శించుకున్న దేవాదాయ కమిషనర్!

Kamareddy: తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఇసనపల్లిలోని శ్రీ కాలభైరవ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు.అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కమిషనర్ హనుమంతరావును ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఇసనపల్లిలో కొలువుదీరిన శ్రీ కాలభైరవ స్వామి ఆలయం ఆధ్యాత్మికంగా విశేష ప్రాధాన్యత కలిగిన క్షేత్రమని పేర్కొన్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలిరావడం సంతోషకరమన్నారు. ఆలయానికి ఉన్న విశిష్టతను, ఆధ్యాత్మిక ప్రాధాన్యతను కాపాడుతూ భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేయాలని ఆకాంక్షించారు.

MADHU, KAMAREDDY

MADHU, KAMAREDDY