Nizamabad: ఎడపల్లిలో ‘రైతు నేస్తం’ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ ఇలా త్రిపాఠి!
Nizamabad: ఎడపల్లి రైతు వేదిక నుంచి రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొన్న నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి. ఎల్ నినో పరిస్థితుల దృష్ట్యా మెట్ట పంటలు వేయాలని రైతులకు సూచన.
Nizamabad: ఎడపల్లిలో ‘రైతు నేస్తం’ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ ఇలా త్రిపాఠి!
Nizamabad: ప్రస్తుత ఎల్ నినో పరిస్థితులు, రబీ పంటల ప్రణాళిక, పంటల మార్పిడి , అనువైన పంటల ఎంపిక, సాగు పద్ధతులు, పంటల యాజమాన్యం తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు వీలుగా సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రైతు నేస్తం కార్యక్రమంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి రైతులతో, అధికారులతో, ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొన్నారు.
బోధన్ డివిజన్ ఎడపల్లి మండల కేంద్రంలోని రైతు వేదిక నుండి ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ఎలినో ప్రభావం తో వర్షపాతం పరిస్థితుల కారణంగా వచ్చే పంట రైతులు వరికి బదులు ఇతర మెట్ట పంటలు వేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారి తుమ్మల నాగేశ్వరరావు వీడియో కాన్ఫరెన్స్లో రైతులకు విజ్ఞప్తి చేయగా ఈ అంశంపై జిల్లా కలెక్టర్ రైతులతో కలిసి రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా రైతులకు అవగాహన కల్పించారు.
తాగునీటికి సైతం ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉన్నందున రైతులు ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని వ్యవసాయ బోరుబావులు వద్ద సైతం మెట్ట పంటలను వేసుకోవాలని కలెక్టర్ సూచించారు. తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల సైతం ఎలి నో ప్రభావంతో వర్షాలు కురియకపోవడంతో విద్యుత్ కొరత సైతం తీవ్రంగా ఉండే ప్రమాదం ఉందని వీటిని రైతులు గమనించాలన్నారు.
ఈ రైతు నేస్తం కార్యక్రమంలో ఎడపల్లి సర్పంచ్ రామచందర్,రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, అదనపు కలెక్టర్ భుజంగరావు, బోధన్ ఆర్డీఓ విజయ కుమారి, జిల్లా వ్యవసాయ అధికారి వీరస్వామి, జిల్లా ఉద్యానశాఖ అధికారి శ్రీనివాస్ రావు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.




