Balkonda: ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ అందుకున్న బాల్కొండ యువకుడు!

Balkonda: నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం వన్నెల్ (బి) గ్రామానికి చెందిన చౌటి శివానంద్ ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి సంస్కృతంలో డాక్టరేట్ అందుకున్నారు.

VENU, BALKONDA
Published on: 22 Nov 2026 9:11 AM IST
Balkonda
X

Balkonda: ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ అందుకున్న బాల్కొండ యువకుడు!

Balkonda: ​నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం వన్నెల్ (బి) గ్రామానికి చెందిన చౌటి శివానంద్‌ ప్రతిష్ఠాత్మక ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్‌ (పీహెచ్‌.డీ) పట్టాను అందుకున్నారు. ఇటీవల నిర్వహించిన విశ్వవిద్యాలయ 103వ వార్షిక స్నాతకోత్సవంలో సంస్కృత విభాగం తరఫున ఆయనకు ఈ గౌరవం లభించింది.

​పరిశోధన విశేషాలు:

రంగాచార్యులు రచించిన ‘ఆంధ్ర–తెలంగాణ శుకసందేశ కావ్యం’ అనే అంశంపై శివానంద్‌ లోతైన పరిశోధన చేశారు. సంస్కృత కావ్యసాహిత్యం ఆధారంగా ఆంధ్ర–తెలంగాణ ప్రాంతాల చారిత్రక, సాంస్కృతిక, తాత్త్విక మరియు వ్యాకరణ విశేషాలను ఆయన తన సిద్ధాంత వ్యాసంలో విశ్లేషించారు. ఢిల్లీ విశ్వవిద్యాలయ సంస్కృత విభాగానికి చెందిన డా. ఎం. కిషన్‌ ఈ పరిశోధనకు మార్గదర్శకత్వం వహించారు.

​కృతజ్ఞతలు తెలిపిన డా. శివానంద్‌:

డాక్టరేట్‌ సాధించడంపై డా. శివానంద్‌ హర్షం వ్యక్తం చేశారు. తన విజయానికి పరిశోధన మార్గదర్శకులు డా. ఎం. కిషన్‌ ప్రోత్సాహం, గురువుల ఆశీస్సులు, తల్లిదండ్రులు చౌటి అరుణ – శేషనారాయణల ప్రేమాభిమానాలు ఎంతో తోడ్పడ్డాయని పేర్కొన్నారు.

సాధారణ స్థాయి నుంచి తనను ‘డా. శివానంద్‌’. ను తీర్చిదిద్దడంలో. ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన పండితులు, కుటుంబ సభ్యులు, మిత్రులందరికీ ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు , గ్రామస్థులు మరియు శ్రేయోభిలాషులు ఆయనకు అభినందనలు తెలియజేశారు.

VENU, BALKONDA

VENU, BALKONDA