Banswada: బాన్సువాడలో కారు ఢీకొని బైక్ రైడర్‌కు తీవ్ర గాయాలు!
Banswada: కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం దేశాయిపేట్ సమీపంలో కారు ఢీకొనడంతో బైక్‌పై వెళ్తున్న సోమేశ్వర్ గ్రామానికి చెందిన శ్రీరాములు తీవ్రంగా గాయపడ్డారు.
Banswada: బాన్సువాడలో కారు ఢీకొని బైక్ రైడర్‌కు తీవ్ర గాయాలు!
Banswada: కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం దేశాయిపేట్ డిగ్రీ కాలేజీ సమీపంలో కారు ఢీకొని,బైక్ పై వెళ్ళుచున్న వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన శనివారం చోటుచేసుకుంది. సోమేశ్వర్ గ్రామానికి చెందిన నిజ్జని శ్రీరాములు తన శైన్ ద్వి చక్ర వాహనం పై వెళ్లు చుండగా,వెనుక నుండి వేగంగా వచ్చిన కారు ఢీ కొట్ట గా,నిజ్జని శ్రీ రాములు తీవ్ర గాయాలు అయ్యాయి.
కుడి కాలుకు,ఎడమ చేతు కు గాయం అయ్యింది. వెంటనే అతనిని బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. కాగా డీ కొట్టిన కారు మహారాష్ట పాసింగ్ ది ఉన్నట్లు తెలిసింది.పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుని కుటుంబ సభ్యులు తెలిపారు.




