Kamareddy: మల్లాపూర్‌లో ఆర్థిక అక్షరాస్యతపై బ్యాంక్ అధికారుల అవగాహన సదస్సు!
Kamareddy: కామారెడ్డి జిల్లా బిర్కూర్ మండలం మల్లాపూర్ గ్రామంలో కెనరా బ్యాంక్, ఎస్ఎస్టీ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన సదస్సు నిర్వహించారు.
Kamareddy: మల్లాపూర్‌లో ఆర్థిక అక్షరాస్యతపై బ్యాంక్ అధికారుల అవగాహన సదస్సు!
Kamareddy: కామారెడ్డి జిల్లా బిర్కూర్ మండలం మల్లాపూర్ గ్రామంలో ఆర్థిక అక్షరాస్యత కేంద్రం బాన్సువాడ. RBI DEA ఫండ్ సహకారంతో కెనరా బాంక్ సౌజన్యంతో, SST సంస్థ ఆధ్వర్యంలో మల్లాపూర్ గ్రామంలో ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన సదస్సు ఏర్పాటు చేయటం జరిగింది.
ఇందులో భాగంగా ప్రజలకు పొదుపు ఏ విధంగా చేసుకోవాలి, బ్యాంకుల పైన, బ్యాంకు లలో అందించే సేవల గురించి, అవగాహన, సైబర్ నేరాల పైన అవగాహన మరియు జాగ్రత్తలు, ఏటీఎం వాడడం వల్ల ఉపయోగాలు, డిజిటల్ పేమెంట్స్ మరియు భీమా పథకాలు Pmsby & Pmjjby, పైన అలాగే Apy, సుకన్య సమృద్ధి యోజన పథకాల పైన అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఇట్టి కార్యక్రమంలో, సర్పంచ్ వొట్లం రమేష్ Sir,మాజీ ZPTC ద్రోణవల్లి సతీష్ , UBI బిర్కూర్ మేనేజర్ రాజేందర్ నాయక్ ,RDO ఉమేష్ ,అసిస్టెంట్ మేనేజర్ భాను ,సిబ్బంది నరేష్ ,BC హన్మాండ్లు సార్,,Fa అరుణ్ గౌడ్,CFL కౌన్సిలర్స్ పర్వయ్య లక్ష్మ గౌడ్, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.




