Jukkal: విద్యుత్ కోతల పై బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం

Jukkal: కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యుత్ కోతలు, లో-వోల్టేజీతో పంట నష్టం జరుగుతోందని, శనివారం జుక్కల్‌లోని అన్ని మండలాల్లో ప్రెస్ మీట్లు పెట్టాలని హన్మంత్ షిండే పిలుపునిచ్చారు.

VEERANNA, JUKKAL
Published on: 16 Oct 2026 9:17 PM IST
Jukkal
X

Jukkal: విద్యుత్ కోతల పై బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం

జుక్కల్ (కామారెడ్డి): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో లో ఓల్టేజి సమస్య, విద్యుత్ సరపరలో అంతరాయల వల్ల ఏర్పడ్తున్న పంటల నష్టం పై శనివారం జుక్కల్ నియోజకవర్గం లొని అన్ని మండల కేంద్రాల్లో బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ అధ్యక్షులు, నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించాలని జుక్కల్ మాజి బి ఆర్ ఎస్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే తెలిపారు.

విద్యుత్ సరపరలో కాంగ్రెస్ పార్టీ అరాచక పాలన పై మీడియా పరంగా తెలియజేయ్యాలని బి ఆర్ ఎస్ నాయకులకు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎలినో ప్రభావం వల్ల వర్షాలు కురువవని శాస్త్ర వేత్తలు ముందే తెలిపినప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు తగిన జాగ్రత్తలు తీసుకోలేదని దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని కోరుతు మీడియా పరంగా తెలియపర్చాలని అన్నారు.

VEERANNA, JUKKAL

VEERANNA, JUKKAL