Nizamabad: నిజామాబాద్‌లో తెలంగాణ ఉద్యమకారులకు ఘనంగా సన్మానం!
Nizamabad: నిజామాబాద్‌లో తెలంగాణ ఉద్యమకారులకు ఘన సన్మానం. బాజిరెడ్డి గోవర్ధన్, జగన్ చేతుల మీదుగా శక్కరి కొండ కృష్ణకు సత్కారం. పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని వెల్లడి.
Nizamabad: నిజామాబాద్‌లో తెలంగాణ ఉద్యమకారులకు ఘనంగా సన్మానం!
Nizamabad: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో 2001 సంవత్సరం నుంచి నేటి వరకు క్రియాశీలకంగా పనిచేస్తూ, పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా పార్టీకి అండగా నిలిచిన ఉద్యమకారులను శుక్రవారం రోజు ఘనంగా సన్మానించారు. మాజీ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, నియోజకవర్గ ఇన్‌చార్జి బాజిరెడ్డి జగన్ చేతుల మీదుగా సన్మానం చేశారు.
ఈ సందర్భంగా సన్మానం అందుకున్న బి.ఆర్.ఎస్ సీనియర్ నాయకుడు శక్కరి కొండ కృష్ణ ఉద్యమకారుడు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొని, కేసీఆర్ నాయకత్వంలో పనిచేసినందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఉద్యమకారుడిగా గుర్తింపు లభించడం గర్వంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. మాజీ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ నాయకత్వంలో పనిచేస్తూ, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ భవిష్యత్తులోనూ పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ తన వంతు బాధ్యతను నిర్వర్తిస్తానని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ముందుకు సాగుతానని, పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు.




