Bodhan: బోధన్‌లో కార్డెన్ సెర్చ్.. సరైన పత్రాలు లేని 20 వాహనాల సీజ్
Bodhan: బోధన్ సర్దార్జీ గల్లీలో ఏసీపీ శ్రీనివాస్, సీఐ వెంకటనారాయణ ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్. పత్రాలు లేని 20 ద్విచక్ర వాహనాలు సీజ్, మత్తుకు దూరంగా ఉండాలని హెచ్చరిక.
Bodhan: బోధన్‌లో కార్డెన్ సెర్చ్.. సరైన పత్రాలు లేని 20 వాహనాల సీజ్
బోధన్: బోధన్ పట్టణంలోని సర్దార్ సర్దార్ జి గలిలో ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. అనుమానిత ద్విచక్ర వాహనాలను వివిధ త్రీ వీలర్ వాహనాల పత్రాలను పరిశీలించి సరైన పత్రాలు లేని 20 ద్విచక్ర వాహనాలను బోధన్ పట్టణ సీఐ వెంకట్ నారాయణ ఆధ్వర్యంలో సీజ్ చేశారు.
గడపగడపకు పరిశీలించి కాలనీవాసులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. మత్తు పదార్థాలకు బానిస కాకూడదని సర్దార్జీ కాలనీవాసులను విజ్ఞప్తి చేశారు. చోరీలు ఇతర కార్య కాలా పాలకు తావివ్వకుండా ప్రజలు మలుచుకోవాలని ఏసీబీ శ్రీనివాస్ సూచించారు.
దొంగతనాల పట్ల ప్రజలకు అప్రమత్తంగా ఉంచేందుకు, కాటన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని ఏసిపి వెల్లడించారు. యువత డక్స్కు దూరం ఉండి సన్మార్గంలో నడుచుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఈ కాటన్ సెర్చ్ లో సిఐలు విజయబాబు, కృష్ణ తోపాటు, రుద్రుర్ ఇంచార్జ్ ఎస్ ఐ రాము, రూరల్ ఎస్సై రాజశేఖర్ గంగాధర్, హబీబ్, రమా, రాజు తో పాటు 80 మంది సిబ్బంది పాల్గొన్నారు.




