Bodhan: బోధన్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ప్రతిపక్షాల ఆందోళన!

Bodhan: బోధన్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ప్రతిపక్షాల ఆందోళన. సమస్యలు వినకుండా నిమిషాల్లో ముగించారని ఎంఐఎం, బీజేపీ, బీఆర్‌ఎస్ కౌన్సిలర్ల నిరసన.

K RAVI, BODHAN
Published on: 29 Sept 2026 3:08 PM IST
Bodhan
X

Bodhan: బోధన్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ప్రతిపక్షాల ఆందోళన!

Bodhan: బోధన్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ జాదావ కృష్ణ మున్సిపల్ చైర్మన్ పద్మ శరత్ రెడ్డి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. మంగళవారం నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో ప్రతిపక్ష కౌన్సిలర్లు ఎంఐఎం, బిజెపి,బి ఆర్ ఎస్ కౌన్సిలర్ల సమస్యలను వినకుండానే ఎజెండా అంశాలు చర్చించకుండానే సమావేశం ముగించడం ఏంటని సమావేశాల్లో ప్రతి అక్ష కౌన్సిలర్లు ఆందోళన కు దిగారు.

ఇటీవల జరిగిన గణేష్ ఉత్సవాల్లో రూ. 16 లక్షల నిధులు ఖర్చుపై వివరాలు వెల్లడించాలని, స్లాటర్ హౌస్ మంజూరు పై ఇంతవరకు పనులు చేపట్టకపోవడం అనే అంశాలపై తాము ప్రశ్నించేందుకు వెళ్లగా సమావేశాన్ని ఐదు నిమిషాల్లో ముగించి కమిషనర్ ఆయన తప్పులను కప్పిపించుకునే ప్రయత్నంలో నిమిషాలలోనే కౌన్సిల్ సమావేశాన్ని ముగించ డ మెంటని మండిపడ్డారు. విషయం తెలుసుకున్న బోధన్ పట్టణ సీఐ వెంకటనారాయణ మున్సిపల్ కార్యాలయం చేరుకొని కౌన్సిలర్లను సముదాయించే ప్రయత్నం చేశారు.

మూడు నెలలకు ఒకసారి నిర్వహించే సమావేశంలో తమ కాలనీలో ఉన్న సమస్యలను చెప్పుకుందామని వస్తే కమిషనర్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ తమ గొంతు నొక్కిస్తున్నారని ఎంఐఎం బిజెపి కౌన్సిలర్లు మండిపడ్డారు. ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ ఇలియాస్ మాట్లాడుతూ బోధన్ మున్సిపాలిటీలో అవినీతి పెట్రేగుతుందని తామ్ము ఈ అంశాలపై చర్చించేందుకు ప్రయత్నిస్తుంటే పోలీసు బలగాలతో అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బిజెపి కౌన్సిలర్ బాలరాజు మాట్లాడుతూ సమావేశాల్లో తమకు చర్చించే అవకాశం ఇవ్వకపోతే ప్రజల్లోకి తాము ఎలా వెళ్లాలని ఆవేదన వ్యక్తం చేశారు.

అనంతరం మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణను అడ్డుపోని ప్రయత్నం చేసి కమిషనర్ డౌన్ డౌన్ అని నినాదాలు చేస్తూ బోధన్ మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఆందోళనకారులను ఎస్హెచ్ఓ వెంకటనారాయణ సముదాయించి కమిషనర్ ను అక్కడినుండి పంపించి వేశారు.

K RAVI, BODHAN

K RAVI, BODHAN