Bodhan: బోధన్‌లో చేయూత పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్ల పత్రాలు అందించిన సుదర్శన్ రెడ్డి!

Bodhan: బోధన్ నియోజకవర్గంలోని రెంజల్, నవీపేట్ మండలాల్లో శుక్రవారం నూతన చేయూత పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్ల పత్రాలను ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పంపిణీ చేశారు.

K RAVI, BODHAN
Published on: 20 Nov 2026 8:00 PM IST
Bodhan
X

Bodhan: బోధన్‌లో చేయూత పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్ల పత్రాలు అందించిన సుదర్శన్ రెడ్డి!

నిజామాబాదు జిల్లా: నిజామాబాదు జిల్లాలో నూతనంగా మంజూరు అయిన చేయుత పెన్షన్లను, ఇందిరమ్మ ఇండ్ల అబ్దిదారులకు పత్రాలను అందించిన రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారులు బోధన్ ఎమ్మెల్యే పొదుటూరి సుదర్శన్ రెడ్డి. బోధన్ నియోజకవర్గంలోని రెంజల్, నవీపేట్ మండలలో నూతన చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు అందజేశారు.

రాష్ట్రంలో కుల మతాలకు అతీతంగా అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క లక్ష్యమన్నారు. రాబోయే రోజుల్లో త్రాగునీటి ఇబ్బంది కాకుండా జాగ్రత్తలు చేపట్టాలని ప్రజలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమిక్ చైర్మన్ తాహెర్బిన్ హుందాన్,కాంగ్రెస్ మండలాల అధ్యక్షులు, సహకార సంఘాల చైర్మన్ లు,కాంగ్రెస్ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

K RAVI, BODHAN

K RAVI, BODHAN