Bodhan: బోధన్ డివిజన్‌లో వరి నాట్లకు సిద్ధమవుతున్న రైతులు
Bodhan: బోధన్ డివిజన్‌లో ఎల్ నినో హెచ్చరికలను పక్కనబెట్టి వరి నాట్లకు సిద్ధమవుతున్న రైతులు. క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించడంలో వ్యవసాయ శాఖ అధికారులు విఫలం.
Bodhan: బోధన్ డివిజన్‌లో వరి నాట్లకు సిద్ధమవుతున్న రైతులు
బోధన్: బోధన్ డివిజన్ పరిధిలోనీ సంగెం, మినార్పల్లి, భవానీపేట శివారు ప్రాంతలలో ఎల్నినో ప్రభావం కానరావడం లేదు. ఒక పక్క ప్రభుత్వం వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రబీ లో ఆరుతడి పంటలు వేసుకోవాలని, ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో విద్యుత్ కొరతతో, భూ గర్భ జలాలు అడుగంటుతున్నాయని అధికారులు చేస్తున్న ప్రచారాలు ప్రకటనలకే పరిమితమయ్యాయి.
క్షేత్రస్థాయిలో బోధన్ డివిజన్ పరిధిలోనీ రైతులకు అవగాహన కల్పించడంలో అధికారులు విడమాలవతున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ప్రాంతాల రైతులు ఎల్ నినో ప్రభావంలోను సైతం సమాయత్తమవుతున్నారు. వరి నార్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నారు. వ్యవసాయ శాఖతో పాటు, విద్యుత్, రెవెన్యూ శాఖల అధికారులు కనుమరుగయ్యారు. దీనితో పూర్తి స్థాయిలో అవగాహన కల్పించకపోవడంతో రైతులు నష్టపోయే ప్రమాదముందని పలు అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.




