Nizamabad: రైతులకు కాంగ్రెస్ మోసపూరిత హామీలు - బీజేపీ ఎమ్మెల్యే సైకిల్ యాత్ర!
Nizamabad: ఎన్నికల హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ ఆరోపణ.
Nizamabad: రైతులకు కాంగ్రెస్ మోసపూరిత హామీలు - బీజేపీ ఎమ్మెల్యే సైకిల్ యాత్ర!
Nizamabad: ఎన్నికల ముందు రైతులకు కాంగ్రెస్ మోసపూరిత హామిలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ ఆరోపించారు. రైతాంగానికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కిసాన్ మోర్చా ఆధ‌్వర్యంలో నిజామాబాద్‌లో సైకిల్ యాత్ర చేపట్టారు.
వరంగల్ డిక్లరేషన్‌లో రైతులకు అనేక హామీలు ఇచ్చి ఏ ఒక్కటి అమలు చేయలేదని మండిపడ్డారు. 2 లక్షల రుణమాఫీ, ఇందిరమ్మ రైతు భరోసా, భూములేని రైతు కూలీలకు 12 వేల ఆర్థిక సాయం వంటి హామీలు ఇచ్చి అమలు చేయడం లేదన్నారు.




