Birkur: బీర్కూర్‌లో ఉల్లాస్, PMFME పథకాల పరిశీలన
Birkur: కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలో ఉల్లాస్ పరీక్షలు, పీఎంఎఫ్‌ఎంఈ పాల కేంద్రం, స్త్రీనిధి యూనిట్లను డీఆర్‌డీఓ ఏపీడీ విజయలక్ష్మి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
Birkur: బీర్కూర్‌లో ఉల్లాస్, PMFME పథకాల పరిశీలన
బీర్కూర్: ఈ రోజు బీర్కూర్ మండలంలో జిల్లా DRDO/APD శ్రీమతి విజయలక్ష్మి, DPM సాయిలు, ఉల్లాస్ జిల్లా కోఆర్డినేటర్ రవీందర్ , APM శిరీషా, CC రాజు, VOA పండరి తదితరులు పాల్గొని వివిధ కార్యక్రమాలను పరిశీలించారు.
ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా సంఘ సభ్యులు రాసిన ఉల్లాస్ పరీక్ష ప్రశ్నపత్రాలను పరిశీలించారు. PMFME పథకంలో భాగంగా పాల కేంద్రాన్ని సందర్శించి, నిర్వహణ మరియు అభివృద్ధికి సంబంధించి పలు సూచనలు చేసారు.
అదేవిధంగా స్త్రీనిధి పథకంలో ఐశ్వర్య రుణాలు పొందిన ఆర్.ఆర్. టెక్స్‌టైల్స్ & డ్రెస్సెస్ సంస్థను సందర్శించి, వ్యాపార నిర్వహణ, రుణ వినియోగం మరియు అభివృద్ధికి సంబంధించి పలు సూచనలు ఇచ్చారు.
మహిళా సంఘాల అభివృద్ధి – సభ్యుల ఆర్థిక సాధికారతే తమ లక్ష్యం అని వారు అన్నారు.




