Bichkunda: బిచ్కుందలో గ్రామ సంఘాల అధ్యక్షురాళ్లకు ప్రత్యేక శిక్షణ!

Bichkunda: బిచ్కుందలో 28 గ్రామ సంఘాల అధ్యక్షురాళ్లకు శిక్షణ మహిళా సంఘాల బలోపేతం, రికార్డుల నిర్వహణ, పారదర్శకతపై అవగాహన కల్పించిన ఏపీఎం రవీందర్, సీనియర్ సీఆర్పీలు.

VEERANNA, JUKKAL
Published on: 28 Sept 2026 7:05 PM IST
Bichkunda
X

Bichkunda: బిచ్కుందలో గ్రామ సంఘాల అధ్యక్షురాళ్లకు ప్రత్యేక శిక్షణ!

బిచ్కుంద: కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలో గ్రామ సంఘాల నిర్వహణపై అధ్యక్షురాళ్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మండలంలోని 28 గ్రామ సంఘాల అధ్యక్షురాళ్లకు సంఘాల నిర్వహణ, పుస్తకాల నిర్వహణ, మహిళా సంఘాల పనితీరు, గ్రామ సంఘాల గ్రేడింగ్ విధానం తదితర అంశాలపై సీనియర్ CRPలు శారద, శృతి శిక్షణ ఇచ్చారు.

మహిళా సంఘాల కార్యకలాపాలను మరింత సమర్థవంతంగానిర్వహించడంతో పాటు, సంఘాల ఆర్థిక లావాదేవీలు, రికార్డుల నిర్వహణలో పారదర్శకత పాటించే విధానాలను ఈ శిక్షణలో వివరించారు. గ్రామస్థాయిలో మహిళా సంఘాలను మరింత బలోపేతం చేసేందుకు అధ్యక్షురాళ్లు కీలకంగా వ్యవహరించాలనిసూచించారు.

కార్యక్రమంలో మండల సమాఖ్యఅధ్యక్షురాలు రేష్మ బేగం, ఏపీఎం రవీందర్, అకౌంటెంట్ జబ్బార్తో పాటు 28 గ్రామ సంఘాల అధ్యక్షురాళ్లు పాల్గొన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్వయం సహాయక సంఘాలు కీలకంగా నిలుస్తున్న నేపథ్యంలో ఇలాంటి శిక్షణలు సంఘాల పనితీరును మరింత మెరుగుపరచేందుకు దోహదపడతాయని నిర్వాహకులు తెలిపారు.

VEERANNA, JUKKAL

VEERANNA, JUKKAL