Bichkunda: 28న బిచ్కుంద సహకార సంఘం సర్వసభ్య భేటీ: శ్రీహరి

Bichkunda: కామారెడ్డి జిల్లా బిచ్కుంద రైతు సేవా సహకార సంఘం సర్వసభ్య సమావేశం ఈ నెల 28న ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నట్లు చైర్మన్ బాలాజీ శ్రీహరి తెలిపారు.

VEERANNA, JUKKAL
Published on: 27 Sept 2026 7:04 PM IST
Bichkunda
X

Bichkunda: 28న బిచ్కుంద సహకార సంఘం సర్వసభ్య భేటీ: శ్రీహరి

బిచ్కుంద (కామారెడ్డి ): కామారెడ్డి జిల్లా బిచ్కుంద రైతు సేవా సహకార సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 28న సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు సంఘం చైర్మన్ నల్చర్ బాలాజీ శ్రీహరి తెలిపారు.ఈ సందర్భంగా బిచ్కుంద రైతు సేవా సహకార సంఘం పరిధిలోని సభ్యులకు సమావేశానికి సంబంధించిన వివరాలను తెలియజేశారు.

సోమవారం ఉదయం 11 గంటలకు సంఘ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.సమావేశంలో 2026 ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 26 వరకు జరిగిన గల జమా ఖర్చుల పట్టికలను పరిశీలించి ఆమోదించడం, 2025-26 ఆడిట్ నివేదికను సభ్యుల సమక్షంలో పరిశీలించి ఆమోదించడం వంటి అంశాలను చర్చించనున్నట్లు తెలిపారు.

అలాగే సంఘానికి సంబంధించిన KCC అకౌంట్ నంబర్ 37104478679ను రెన్యువల్ చేయడం లేదా నూతన KCC అకౌంట్ ఏర్పాటు చేయడంపై, ఇతర ముఖ్యమైన విషయాలపైకూడాసమావేశంలో చర్చించనున్నట్లు చైర్మన్ నల్చర్ బాలాజీ శ్రీహరి తెలిపారు.

సహకార సంఘ సభ్యులు సర్వసభ్య సమావేశానికి హాజరై తమ అభిప్రాయాలను తెలియజేయాలని ఆయన కోరారు.రైతులతోపాటు పాలక వర్గ సభ్యులు హాజరు కావాలని సహకార సంఘం సి ఇ ఓ శ్రవణ్ కుమార్ తెలిపారు.

VEERANNA, JUKKAL

VEERANNA, JUKKAL