Bichkunda: బిచ్కుంద రైతు సేవా సహకార సంఘం 61వ మహాజన సభ!
Bichkunda: కామారెడ్డి జిల్లా బిచ్కుంద రైతు సేవా సహకార సంఘం 61వ మహాజన సభ నిర్వహణ. పలు కీలక తీర్మానాల ఆమోదం, ఎండీ గైర్హాజరీపై రైతుల అసంతృప్తి.
Bichkunda: బిచ్కుంద రైతు సేవా సహకార సంఘం 61వ మహాజన సభ!
Bichkunda: బిచ్కుంద (కామారెడ్డి )బిచ్కుంద రైతు సేవా సహకార సంఘంలో 61వ మహాజన సభ సంఘం అధ్యక్షుడు నల్చార్ బాలాజీ శ్రీహరి అధ్యక్షతన నిర్వహించారు. సభలో సంఘానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించి తీర్మానాలు ఆమోదించారు.
2026 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు జరిగిన సంఘం లావాదేవీలను సభ్యులు ఆమోదించారు. అలాగే 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆడిట్ నివేదికను కూడా మహాజన సభలో ఆమోదించారు.సభలో మరో కీలక నిర్ణయంగా బిచ్కుంద ఎస్‌బీఐ శాఖ ద్వారా సంఘం కిసాన్ క్రెడిట్ కార్డు (KCC) ఖాతాలను పునఃప్రారంభించి, అర్హులైన రైతులకు కొత్త KCC ఖాతాలు మంజూరు చేయాలని తీర్మానించారు. అదేవిధంగా సంఘం బైలా నిబంధనల ప్రకారం ప్రభుత్వం సహకార సంఘ ఎన్నికలు నిర్వహించాలని మహాజన సభలో నిర్ణయించారు.
కాగ ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరుకావాల్సిన సహకార సంఘ ఎండీ గైర్హాజరు కావడంపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేశారు. రైతుల సమస్యలు, సంఘానికి సంబంధించిన అంశాలపై ఎండీ నేరుగా స్పందించాల్సి ఉండగా సమావేశానికి రాకపోవడాన్ని పలువురు సభ్యులు ప్రశ్నించారు.కార్యక్రమంలో వైస్ చైర్మన్ యాదరావు, డైరెక్టర్లు దర్పాల్ సంజు, పోతుల అశోక్, శంకర్ నాయక్, చంద్రకాంత్ పటేల్, గణపతి రెడ్డి, సీఈవో శ్రవణ్ పటేల్, సంఘం సిబ్బంది, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




