Jukkal: పెండింగ్ జీతాల కోసం రోడ్డెక్కిన మున్సిపల్ కార్మికులు!

Jukkal: బిచ్కుంద మున్సిపాలిటీలో మూడు నెలలుగా వేతనాలు అందక కార్మికుల మెరుపు ధర్నా. వెంటనే బకాయిలు చెల్లించాలని డిమాండ్.

VEERANNA, JUKKAL
Published on: 24 Sept 2026 11:06 AM IST
Jukkal
X

Jukkal: పెండింగ్ జీతాల కోసం రోడ్డెక్కిన మున్సిపల్ కార్మికులు!

Jukkal: బిచ్కుంద (కామారెడ్డి ) కామారెడ్డి జిల్లా బిచ్కుంద మున్సిపాలిటీలో ప్రజలకు నిత్యం సేవలు అందిస్తున్న మున్సిపల్ కార్మికులు ఇప్పుడు తమ హక్కుల కోసం రోడ్డెక్కారు. మూడు నెలలుగా వేతనాలు అందక కుటుంబాలను పోషించడం కూడాకష్టంగామారిందంటూ కార్మికులు మెరుపు ధర్నాకు దిగారు.

పట్టణ పరిశుభ్రత కోసం నిత్యం శ్రమిస్తున్న తమకుజీతాలుఇవ్వకపోవడం అన్యాయమని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్‌లో ఉన్న మూడు నెలల వేతనాలను వెంటనే విడుదల చేయాలని, అలాగే తమ వేతనాలను పెంచాలని ప్రభుత్వాన్ని మున్సిపల్ అధికారులను డిమాండ్ చేశారు.

మరోవైపు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా తమ ఇబ్బందుల పై మున్సిపల్ ప్రజాప్రతినిధులు ఏమాత్రం స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తమైంది. ప్రజల కోసం పనిచేసే కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు కోరుతున్నారు.

తక్షణమే తమ డిమాండ్లు నెరవేరకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని మున్సిపల్ కార్మికులు హెచ్చరించారు. బిచ్కుంద మున్సిపాలిటీలో ఈ పరిణామం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.కార్యక్రమం లో నాగనాథ్.ఎం.శకుంతల.సాయిలు,మెత్రి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

VEERANNA, JUKKAL

VEERANNA, JUKKAL