Bichkunda: బిచ్కుందలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు
Bichkunda: కామారెడ్డి జిల్లా బిచ్కుంద మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు. నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు.
Bichkunda: బిచ్కుందలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు
బిచ్కుంద: భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి,స్వాతంత్ర సమరయోధుడు, మహనీయుడు మౌలానా అబుల్ కలం ఆజాద్ జయంతి వేడుకలను బిచ్కుంద పట్టణంలోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్సియల్ బాలుర గురుకుల పాఠశాల లో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్బంగా మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుడు అసద్ అలీ, డి సి సి మైనార్టీ అధ్యక్షుడు అజీమ్ లాల ల చేతుల మీదుగా మౌలానా చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన జయంతి వేడుకల సందర్బంగా పలువురు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతు మౌలానా దేశ స్వాతంత్ర్య ఉద్యమానికి, విద్య రంగ అభివృద్ధి కి అయన చేసిన విశేష సేవలను స్మరించుకున్నారు.
విద్య ద్వారానే సమాజ అభివృద్ధి సాధ్యమని ఆనాడు ఆ మహనీయుడు అందించిన సందేశాన్నిగుర్తు చేసుకున్నారు.నేటి యువత అలాంటి మహా నీయులను ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్తూ వారు కన్న కలాలను నిజం చెయ్యాలని విద్యార్థులకు సూచించారు.
కార్యక్రమం లో కాంగ్రెస్ నాయకులు ఖలీల్ సెట్, భోగడ మీది సాయిలు, మున్సిపల్ కౌన్సిలర్ ముజహీద్,మౌలానా తోపాటు కళాశాల ప్రిన్సిపాల్ సాయిలు ఇతర ప్రముఖులు పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.




