Bichkunda: ఘనంగా గణేశ్ నిమజ్జన శోభాయాత్ర రూ.80,555కు లడ్డు దక్కించుకున్న భక్తుడు
Bichkunda: పెద్ద దేవడా గ్రామంలో ఘనంగా విఘ్నేశ్వరుడి నిమజ్జన శోభాయాత్ర. రూ.80,555కు గణనాథుడి లడ్డు దక్కించుకున్న భక్తుడు నిలవర్ నాగప్ప.
Bichkunda: ఘనంగా గణేశ్ నిమజ్జన శోభాయాత్ర రూ.80,555కు లడ్డు దక్కించుకున్న భక్తుడు
బిచ్కుంద: పెద్ద దేవడా (కామారెడ్డి ) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని బిచ్కుంద మండలం పెద్ద దేవడా గ్రామంలో శ్రీ విఘ్నేశ్వరుడి నిమజ్జన శోభాయాత్ర భక్తిశ్రద్ధల నడుమ అంగరంగ వైభవంగా జరిగింది. తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, నిత్యారాధనలతో కొలువుదీరిన గణనాథుడికి భక్తులు ఘనంగా వీడ్కోలు పలికారు.
ఈ సందర్భంగా సర్వజానిక్ గణేష్ మండలి మరియు బసవేశ్వర గణేష్ మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన లడ్డు వేలం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. గ్రామానికి చెందిన నిలవర్ నాగప్ప రూ. 80,555కు లడ్డు వేలం పాడి కైవసం చేసుకోగా, సతీష్ గౌడ్ రూ. 11,000కు వినాయకుడి సేవను దక్కించుకున్నారు.
అనంతరం మహిళలు, యువకులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని భజనలు, కీర్తనలు, కోలాటాలు చేస్తూ గ్రామ వీధుల గుండా ఉత్సాహభరితంగా శోభాయాత్ర నిర్వహించారు. డప్పు వాయిద్యాలు, భక్తి నినాదాల మధ్య సాగిన ఈ శోభాయాత్ర కౌలాస్ వాగు వద్దకు చేరుకుని, వేద మంత్రోచ్చారణల నడుమ శ్రీ విఘ్నేశ్వరుడి నిమజ్జనం చేశారు.
భక్తుల సందడి, ఆధ్యాత్మిక వాతావరణం, సంప్రదాయ కళారూపాలతో పెద్ద దేవడా గ్రామం వినాయక నిమజ్జన వేడుకలు భక్తి పారవశ్యాన్నితలపించాయి.
కార్యక్రమం లో బిచ్కుంద మార్కెట్ కమిటి మాజి చైర్మన్ నిలవర్ మల్లికార్జున్ పాటిల్, మాజి సర్పంచ్ లు జె. శివానంద్ అప్ప, సంజు దేశాయ్, బసవేశ్వర గణేష్ మండలి అధ్యక్షుడు జె. జీవన్ గారి శివరాజ్ పాటిల్, మాజి ఉప సర్పంచ్ నిలవర్ నాగప్ప, హన్మంత్, బుస మారుతీ పాటిల్, జంగం అనిల్ స్వామి, భద్రప్ప స్వామి, పోలీస్ పాటిల్, ఆనంద్ రావ్, గ్రామ పెద్దలు బసవరాజు దేశాయ్, నిలవర్ వీర్ రాజ్, సతీష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.




