Bichkunda: అమ్మకు అక్షరమాల: బిచ్కుందలో 670 మంది మహిళల పరీక్ష
Bichkunda: కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలో ‘అమ్మకు అక్షరమాల’ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఉల్లాస్ పరీక్షలకు 22 కేంద్రాల్లో 670 మంది మహిళలు హాజరయ్యారు.
Bichkunda: అమ్మకు అక్షరమాల: బిచ్కుందలో 670 మంది మహిళల పరీక్ష
బిచ్కుంద(కామారెడ్డి ): కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల పరిధిలో మహిళల్లో అక్షరాస్యతను పెంపొందించే లక్ష్యంతో నిర్వహిస్తున్న ‘అమ్మకు అక్షరమాల’ కార్యక్రమంలో భాగంగా ఉల్లాస్ పరీక్షలు ఉత్సాహంగా జరిగాయి. మండలంలోని మొత్తం 22 పరీక్షా కేంద్రాల్లో 670 మంది మహిళలు పరీక్షలకు హాజరై ఉత్సాహంగా రాశారు.
మహిళలు విద్యపై ఆసక్తి పెంచుకోవడంతో పాటు చదవడం, రాయడం వంటి ప్రాథమిక నైపుణ్యాలను సాధించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పరీక్షల నిర్వహణలో ఏపీఎంలు, సీసీలు, వీవోఏలు, వీవో అధ్యక్షురాళ్లు తదితరులు పాల్గొని మహిళలకు అవసరమైన సహకారం అందించారు.
ఈ సందర్భంగా పరీక్షలకు హాజరైన మహిళలు ఉత్సాహంగా పరీక్షలు రాయడం కనిపించింది. మహిళల్లో అక్షరాస్యతను పెంపొందించేందుకు ‘అమ్మకు అక్షరమాల’ వంటి కార్యక్రమాలు దోహదపడుతున్నాయని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమం లో ఏ పి ఎం. రవీందర్, సి సి ఏ. వెంకట్, వి ఓ లతోపాటు మండల మహిళా సమైక్య ప్రతినిధులు పాల్గొన్నారు.




