Nizamabad: తెలంగాణ వర్సిటీలో భగత్ సింగ్ 119వ జయంతి వేడుకలు!
Nizamabad: తెలంగాణ యూనివర్సిటీలో ఘనంగా భగత్ సింగ్ 119వ జయంతి ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో వేడుకలు, మనుషులను చంపగలరు కానీ ఆశయాలను కాదని టూటా ప్రెసిడెంట్ పున్నయ్య స్పష్టీకరణ.
Nizamabad: తెలంగాణ వర్సిటీలో భగత్ సింగ్ 119వ జయంతి వేడుకలు!
నిజామాబాదు: స్వరాజ్య సాధన కోసం చిరుప్రాయంలోనే ప్రాణత్యాగం చేసిన ఉద్యమ యోధుదు భగత్ సింగ్ 119 వ జయంతి వేడుకలను తెలంగాణ యూనివర్సిటీ ఎన్ ఎస్ ఎస్ యూనిట్ -1 ప్రోగ్రాం ఆఫీసర్ డా. సిహెచ్ శ్రీనివాస్ ఆధ్వర్యర్యంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ పున్నయ్య మాట్లాడుతూ మనుషులను చంపగలం కానీ వారి ఆశయాలను ఎన్నటికీ చంపలేమని కాబట్టే ఇప్పటికి భగత్ సింగ్ ఆయన ఆశయాలలో బ్రతికే ఉన్నాడని తెలిపారు. ఆయన ధైర్యం, ఆత్మవిశ్వాసం, ఆలోచనలు నేటి తరాలకు స్ఫూర్తిగా నిలవాలని పిలునిచ్చారు. మత సామరస్యం, శాంతియుత సహజీవనం, సమానత్వం, సామాజిక న్యాయానికి ఆయన ప్రతీకగా నిలిచారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ యూనివర్సిటీ ప్రజా సంబంధాల అధికారి డాక్టర్ కె.వి రమణాచారి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అధిపతి డాక్టర్ పాత నాగరాజు, యూనివర్సిటీ కళాశాల సూపరింటెండెంట్ ఉమారాణి, యూనిట్-3 ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ స్వామిరావు, ఎన్.ఎస్.ఎస్ వాలంటీర్లు విద్యార్థులు పాల్గొన్నారు.




