Kamareddy: బాన్సువాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వన్యప్రాణుల వారోత్సవాలు!

Kamareddy: బాన్సువాడ జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో వన్యప్రాణుల వారోత్సవాలు ఘనం. వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత అని ఫారెస్టు రేంజ్ అధికారి పిలుపు.

SALEEM, BANSWADA
Published on: 9 Oct 2026 1:32 PM IST
Kamareddy
X

Kamareddy: బాన్సువాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వన్యప్రాణుల వారోత్సవాలు!

Kamareddy: కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని జెడ్పీహెచ్‌ఎస్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం వన్యప్రాణుల వారోత్సవాలు–2026 సందర్భంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఫారెస్టు రేంజ్ అధికారి హబిబ్ పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు వన్యప్రాణుల సంరక్షణ ప్రాధాన్యతను తెలియజేస్తూ, అవగాహన కల్పించారు.వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత అని అటవీ సంరక్షణ అధికారి తెలిపారు. విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించే లక్ష్యంతో వాలీబాల్ టైగర్ కప్ పోటీలను కూడా నిర్వహించారు.పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు, పతకాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సిబ్బంది విద్యార్థులు,అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA