Banswada: బాన్సువాడ నుంచి హైదరాబాద్‌కు నూతన ఆర్టీసీ సూపర్ డీలక్స్ బస్సు!
Banswada: బాన్సువాడ నుంచి హైదరాబాద్‌కు గ్రామీణ ప్రాంత ప్రజల సౌలభ్యం కోసం ఆర్టీసీ కొత్త సూపర్ డీలక్స్ బస్సును ప్రారంభించింది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
Banswada: బాన్సువాడ నుంచి హైదరాబాద్‌కు నూతన ఆర్టీసీ సూపర్ డీలక్స్ బస్సు!
Banswada: గ్రామీణ ప్రాంత ప్రజలకు బాన్సువాడ ఆర్ టీ సి డిపో వారు ఒక శుభ వార్తను తెలిపారు.సూపర్ డీలక్స్ బస్సు ను బాన్సువాడ నుండి హైదరాబాద్ కు ప్రారంభించారు. ఈ బస్సు ప్రత్తి రోజు ఉదయం 4: 30 గంటలకు బాన్సువాడ బస్స్టాండ్ నుండి, బోర్లం, మొండిసడాక్, గండివేట్,సర్వాపూర్,గాంధారి, కామారెడ్డి మీదుగా హైదరాబాద్ కు వెళుతుందని వారు తెలిపారు.ఈ బస్సు ఉదయం 09 - 9: 30 మధ్య జూబ్లీ బస్టాండ్ కు చేరుకుంటుందని ,విద్యార్థులకు,ఉద్యోగులకు సౌకర్యం కలుగుతుందని భావించి ప్రారంభించి నట్లు డిపో మేనేజర్ తెలిపారు.గ్రామీణ ప్రాంతాల వారికి బాగా ఉపయోగ పడుతుందని, ప్రజలు ఈ సర్వీసు ను ఉపయోగించుకోవాలని వారు అన్నారు.




