Banswada: బాన్సువాడలో 27న జాతీయ ఐక్యతా సదస్సు

Banswada: కామారెడ్డి జిల్లా బాన్సువాడ మార్కెట్ యార్డులో ఈ నెల 27న నిర్వహించనున్న జాతీయ ఐక్యతా సదస్సు ఆహ్వాన పత్రికలను ముఫ్తీ ఉమర్ అధికారులకు అందజేశారు.

SALEEM, BANSWADA
Published on: 25 Sept 2026 3:24 PM IST
Banswada
X

Banswada: బాన్సువాడలో 27న జాతీయ ఐక్యతా సదస్సు

బాన్సువాడ: జాతీయ ఐక్యత, పరస్పర సహనాన్ని చాటేలా బాన్సువాడలో బృహత్తర జాతీయ ఐక్యతా సదస్సును నిర్వహించ నున్నట్లు నిర్వాహకులు ముఫ్తీ ఉమర్ బిన్ ఈసా తెలిపారు.

మదర్సా అబ్దుల్లా బిన్ అబ్బాస్ ఆధ్వర్యంలో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. ఇందులో వివిధ మతాలు, వర్గాలకు చెందిన మత, రాజకీయ, సామాజిక ప్రతినిధులు పాల్గొననున్నారు.

ఈ సదస్సుకు సంబంధించిన ఆహ్వాన పత్రికను ముఫ్తీ ఉమర్, బాన్సువాడ ఆర్ డీ ఓ రవీందర్ రెడ్డి,మున్సిపల్ ,కమీషనర్ గోపు గంగాధర్ గార్లకు వార్డు కౌన్సిలర్ మహమ్మద్ ఖాలిక్,మాజీ జడ్ పీ కో ఆప్షన్ సభ్యులు అలీ బిన్ అబ్దుల్లా,లతో కలిసి ఆహ్వాన పత్రికను అందజేసి,తప్పకుండా రావాలని కోరారు.

మార్కెట్ యార్డ్ గంజ్, బాన్సువాడ లో ఈ నెల 27 సెప్టెంబర్ 2026, ఆదివారం సాయంత్రం 7 గంటలకు నిర్వహించు ఈ సదస్సులో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు అన్ని కులాలు,మతాల ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA