Banswada: బాన్సువాడ సమీపంలో రోడ్డు ప్రమాదం: ఏపీ యువకుడు మృతి!

Banswada: బాన్సువాడ మండలం సోమేశ్వర్ వద్ద ఎన్‌హెచ్-765డీ పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన చల్లా డేవిడ్ రాజు చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.

SALEEM, BANSWADA
Published on: 9 Nov 2026 8:09 PM IST
Banswada
X

Banswada: బాన్సువాడ సమీపంలో రోడ్డు ప్రమాదం: ఏపీ యువకుడు మృతి!

బాన్సువాడ: తేదీ 08-11-2026 న సాయంత్రం బాన్సువాడ దాటిన అనంతరం సోమేశ్వర్ శివారులోని NH-765D రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. తూర్పు గోదావరి జిల్లా, రంగంపేట మండలం, వాడి సాలేరు గ్రామానికి చెందిన చల్లా డేవిడ్ రాజు (26), తన బంధువు మూర్తిరామ్‌తో కలిసి AP 37 CD 3845 నంబరు గల మోటార్ సైకిల్‌పై మహమ్మద్ నగర్ నుండి బోధన్ వైపు వెళ్తుండగా, సోమేశ్వర్ గ్రామానికి చెందిన వినోద్ అనే వ్యక్తి TG 17 4588 నంబరు గల మోటార్ సైకిల్‌ను అతివేగంగా, అజాగ్రత్తగా నడుపుతూ వచ్చి వారి మోటార్ సైకిల్‌ను ఢీకొట్టాడు.

ఈ ప్రమాదంలో చల్లా డేవిడ్ రాజుకు తలకు తీవ్ర గాయాలు కాగా, మూర్తిరామ్‌కు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించి, అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ రాత్రి గంటలకు చల్లా డేవిడ్ రాజు మృతి చెందాడు. మృతుడి మేనమామ పాఠం శెట్టి శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు స్టేషన్ హౌస్ ఆఫీసర్ పిఎస్ బాన్సువాడ తెలిపారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA