Banswada: రుద్రూర్ చెరువులో గుర్తుతెలియని వృద్ధుని మృతదేహం లభ్యం!
Banswada: నిజామాబాద్ జిల్లా రుద్రూర్ చెరువులో ఆదివారం సుమారు 60 నుండి 65 సంవత్సరాల వయసున్న గుర్తుతెలియని వృద్ధుని మృతదేహం లభ్యమైంది. చెరువు కట్టపై సైకిల్ లభించింది.
Banswada: రుద్రూర్ చెరువులో గుర్తుతెలియని వృద్ధుని మృతదేహం లభ్యం!
Banswada: నిజామాబాద్ జిల్లా రుద్రూర్ చెరువులో ఆదివారం గుర్తు తెలియని ఓ వృద్ధుని మృతదేహం లభ్యమైంది. చెరువు కట్టపై సైకిల్ కూడా నిలిపి ఉండడాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరు కొని మృతదేహాన్ని వెలికి తీశారు.
మృతి చెందిన వృద్ధుడి వయస్సు సుమారు 60 నుండి 65 సంవత్సరాలు ఉంటుందని అంచనా వేశారు. మృతుని ఆచూకీ తెలిపిన వారు వెంటనే రుద్రూర్ పోలీస్ స్టేషన్ సంప్రదించాలని పోలీసులు కోరారు.




