Banswada: ఓటర్ల జాబితా సవరణ (SIR)పై బాన్సువాడ ఆర్డీవో సమీక్ష!

Banswada: ఓటర్ల జాబితా స్వచ్ఛతకు రాజకీయ పార్టీలు సహకరించాలి: బాన్సువాడలో అఖిలపక్ష సమావేశం నిర్వహించిన ఆర్డీవో రవీందర్ రెడ్డి. ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియపై సుదీర్ఘ సమీక్ష.

SALEEM, BANSWADA
Published on: 23 Sept 2026 7:37 PM IST
Banswada
X

Banswada: ఓటర్ల జాబితా సవరణ (SIR)పై బాన్సువాడ ఆర్డీవో సమీక్ష!

బాన్సువాడ: బాన్సువాడ రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీవో) రవీందర్ రెడ్డి తన కార్యాలయంలో ఈరోజు అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఎన్నికల సంఘం చేపడుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) - ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై వివిధ పార్టీల నాయకులతో చర్చించారు.

ఓటర్ల జాబితాలో నకిలీ, డూప్లికేట్, వలస వెళ్లిన, మరణించిన వారి పేర్లను తొలగించి, అర్హులందరికీ ఓటు హక్కు కల్పించేందుకు ఇంటింటి సర్వే ద్వారా ఈ ప్రక్రియ చేపడుతున్నట్లు ఆర్డీవో వివరించారు.

ప్రతి పార్టీ బీఎల్ఓలకు సహకరించాలని, కొత్త ఓటర్ల నమోదు, తప్పుల సవరణలో భాగస్వామ్యం కావాలని సూచించారు. రాజకీయాలకు అతీతంగా ఓటర్ల జాబితా స్వచ్ఛతకు అందరూ సహకరించాలని కోరారు.

ఈ సమావేశంలో కాంగ్రెస్ నేత మహ్మద్ గౌస్, బీజేపీ నాయకులు కోనాల గంగారెడ్డి, శంకర్ గౌడ్, బీఆర్ఎస్ నాయకుడు రమేష్ యాదవ్, టీడీపీ నాయకుడు షంషుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA