Banswada: బాన్సువాడలో రావణ దహన ఏర్పాట్లను పరిశీలించిన పోచారం భాస్కర్ రెడ్డి
Banswada: బాన్సువాడ మినీ స్టేడియంలో దసరా రావణ కాష్ఠ దహన ఏర్పాట్లను పరిశీలించిన పోచారం భాస్కర్ రెడ్డి. పోలీస్ అధికారులతో కలిసి రక్షణ ఏర్పాట్ల సమీక్ష.
Banswada: బాన్సువాడలో రావణ దహన ఏర్పాట్లను పరిశీలించిన పోచారం భాస్కర్ రెడ్డి
బాన్సువాడ: కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ప్రొఫెసర్ జయశంకర్ మినీ స్టేడియo లో మంగళవారం నిర్వహించనున్న దసరా వేడుకలు, రావణ కాష్ఠ దహన కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ మాజీ చైర్మన్, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు పోచారం భాస్కర్ రెడ్డి పరిశీలించారు.
ఈ సందర్భంగా బాన్సువాడ పట్టణ డీఎస్పీ విఠల్ రెడ్డి, పట్టణ సీఐ శ్రీధర్ తో కలిసి కార్యక్రమ నిర్వహణకు చేపడుతున్న ఏర్పాట్లను సమీక్షించారు.
వేడుకలకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు.ఈ కార్యక్రమంలో బాన్సువాడ పట్టణ మున్సిపల్ కౌన్సిలర్లు,హకీమ్,రాజశేఖర్,నర్సు గోండ,నరసన్న చారి, ప్రజాప్రతినిధులు, మహమ్మద్ ఇజాస్,అబ్దుల్ వహాబ్,నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




