Banswada: బాన్సువాడలో రేపే జాతీయ సమైక్యత సభ - ముఫ్తీ ఉమర్ పిలుపు
Banswada: బాన్సువాడలో రేపు జాతీయ సమైక్యత సభ. ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని మదర్సా వ్యవస్థాపకులు ముఫ్తీ ఉమర్ పిలుపు.
Banswada: బాన్సువాడలో రేపే జాతీయ సమైక్యత సభ - ముఫ్తీ ఉమర్ పిలుపు
బాన్సువాడ: బాన్సువాడలో రేపే జాతీయ సమైక్యత సభ - ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని ముఫ్తీ ఉమర్ పిలుపు మదర్సా అబ్దుల్లా బిన్ అబ్బాస్ ఆధ్వర్యంలో ఆదివారం, సెప్టెంబర్ 27న మగ్రిబ్ నమాజ్ తర్వాత మార్కెట్ యార్డ్ గంజ్ లో నిర్వహించనున్న జాతీయ సమైక్యత (ఖౌమీ ఏక్తా) జల్సాను విజయవంతం చేయాలని మదర్సా వ్యవస్థాపకులు ముఫ్తీ ఉమర్ బిన్ ఈసా పిలుపునిచ్చారు.
బాన్సువాడలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ హిందూ, ముస్లిం, సిక్కు, క్రైస్తవులంతా అన్నదమ్ముల్లాంటి వారనే సందేశాన్ని చాటడమే, ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు. మన దేశం భారత దేశం గంగా జమునా తెహజీబ్ కు నిలయమని, ఆ సంస్కృతిని కాపాడేందుకే ఈ సభను నిర్వహిస్తున్నామని అన్నారు.
ఈ సభలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు, మత పెద్దలు పాల్గొంటారని తెలిపారు. బాన్సువాడ పట్టణంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో సభకు హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ ఖాలిక్ ,షాదీఖానా, చైర్మన్ హాఫిజ్ అబ్దుల్ వహాబ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు అలీ బిన్ అబ్దుల్లా, అఫ్రోజ్ తో పాటు పలువురు ఉలమాలు, హాఫిజ్ లు పాల్గొన్నారు.




