Banswada: బాన్సువాడలో మండల సర్వసభ్య సమావేశం!
Banswada: కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో రానున్న నీటి ఎద్దడి, ఇంకుడు గుంతల ఏర్పాటుపై అధికారుల అవగాహన.
Banswada: బాన్సువాడలో మండల సర్వసభ్య సమావేశం!
Banswada: కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండల ప్రజాపరిషత్ కార్యాలయం లో ఈ రోజు మండలంలోని అన్ని గ్రామల సర్పంచులతో సర్వసభ్య సమావేశం ఏం పీ డీ ఓ ఆనంద్ కుమార్ అధ్యక్షతన నిర్వహించారు.
ఎల్ నినో ప్రభావం తో రానున్న కాలంలో నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉన్నందున,గ్రామాల్లో ఉన్న నీటి వనరులను చాలా జాగ్రత్తగా,పొదుపుగా వాడుకోవాలని సూచించారు.గ్రామంలో పట్టే ఇంటికి ఇంకుడు గుంత ను తప్పకుండా ఏర్పాటు చెయ్యాలని,మ్యాజిక్ సోప్ పిట్స్ లతో పాటు కమ్యూనిటీ సోప్ పిట్స్, బోర్ వెల్ రీఛార్జ్ గుంతలు త్రవ్వించాలని,వాటికి గాను ప్రతీ ఒకరికి ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తుందని తెలిపారు.
రానున్న కాలంలో నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉన్నందున, ముందు జాగ్రత్తగా ప్రభుత్వం వీటి ఏర్పాటుకు ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సర్పంచుల కు అవగాహన కల్పించారు. ఈ సమావేశానికి ఆయా గ్రామాల సర్పంచులు,ఏం పీ ఓ మహబూబ్ తో పాటు ఆయా ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.




