Banswada: తాడ్కోల్‌లో చేయూత పెన్షన్ దరఖాస్తుల క్షేత్రస్థాయి పరిశీలన!

Banswada: తాడ్కోల్ గ్రామంలో చేయూత పెన్షన్ దరఖాస్తుల క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టిన బాన్సువాడ ఎంపీడీవో ఆనంద్ కుమార్. అర్హుల ఎంపిక ప్రక్రియలో సర్పంచ్, కార్యదర్శి భాగస్వామ్యం.

SALEEM, BANSWADA
Published on: 23 Sept 2026 4:49 PM IST
Banswada
X

Banswada: తాడ్కోల్‌లో చేయూత పెన్షన్ దరఖాస్తుల క్షేత్రస్థాయి పరిశీలన!

బాన్సువాడ: కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం తాడ్కోల్ గ్రామంలో చేయూత పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల ఎంపిక కొరకు బాన్సువాడ ఎంపీడీవో ఆనంద్ కుమార్ బుధవారం క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలన చేపట్టారు.

దరఖాస్తుదారుల వివరాలను పరిశీలించి, అర్హతలను నిర్ధారించే ప్రక్రియలో భాగంగా ఈ తనిఖీలు నిర్వహించారు. ఈ పరిశీలనలో ఎంపీడీవో ఆనంద్ కుమార్ వెంట గ్రామ కార్యదర్శి భరత్, సర్పంచ్ అందే రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA