Banswada: సిద్దాపూర్ రిజర్వాయర్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే పోచారం!
Banswada: వర్ని మండలంలోని సిద్దాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనుల పురోగతిని శుక్రవారం బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
Banswada: సిద్దాపూర్ రిజర్వాయర్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే పోచారం!
బాన్సువాడ: బాన్సువాడ నియోజకవర్గం వర్ని మండలంలోని సిద్దాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనుల పురోగతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా రిజర్వాయర్ నిర్మాణ పనుల ప్రస్తుత స్థితిగతులను కాంట్రాక్టర్ను అడిగి తెలుసుకున్నారు. పనులను నిర్దేశిత సమయంలోగా త్వరితగతిన పూర్తి చేయాలని, నిర్మాణంలో ఎలాంటి నాణ్యతా లోపాలు తలెత్తకుండా నిర్దేశిత ప్రమాణాల ప్రకారం పనులు చేపట్టాలని సూచించారు.
రిజర్వాయర్ నిర్మాణ పనుల్లో వేగం పెంచడంతో పాటు, నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా చూడాలని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో పోచారం వెంట వర్ని మార్కెట్ కమిటీ చైర్మెన్ సురేష్ బాబా,సిద్ధాపూర్ సర్పంచ్ బాల సింగ్,ఇరిగేషన్ శాఖా అధికారులు, బాన్సువాడ గ్రామీణ మండలాల నాయకులు, ప్రజాప్రతినిధులు, సిద్దాపూర్ పరిసర గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.




