Banswada: బోర్లం క్యాంప్ తండాలో మ్యాజిక్ సాక్ పిట్‌కు మార్కౌట్ వేసిన అధికారులు

Banswada: బాన్సువాడ మండలం బోర్లం క్యాంప్ తండాలో మ్యాజిక్ సాక్ పిట్‌కు MPDO ఆనంద్ కుమార్ మార్కౌట్ వేసి పనులు ప్రారంభించారు. వేసవి నీటి ఎద్దడి నివారణకే ప్రాధాన్యం.

SALEEM, BANSWADA
Published on: 10 Nov 2026 7:32 PM IST
Banswada
X

Banswada: బోర్లం క్యాంప్ తండాలో మ్యాజిక్ సాక్ పిట్‌కు మార్కౌట్ వేసిన అధికారులు

బాన్సువాడ: కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లం క్యాంప్ తండా లో ఇంకుడు గుంత, మ్యాజిక్ సాక్ పిట్ ఏర్పాటు చేయడానికి ఏం పీ డీ ఓ ఆనంద్ కుమార్,ఏం పీ ఓ మహబూబ్ లు,స్థానిక పంచాయతీ సెక్రటరీ రాహిలా బేగం ,సర్పంచ్ నర్సవ్వ,ఉప సర్పంచ్ దుర్గా ప్రసాద్ ,వార్డు సభ్యుల తో కలిసి,గుంత పనులకు మార్కౌట్ వేసి పనులను ప్రారంభించారు.

రానున్న వేసవి కాలం లో నీటి ఎద్దడి ఏర్పడకుండా,ప్రభుత్వం ఉపాధి హామీ పనుల్లో భాగంగా,వివిధ రకాల ఇంకుడు గుంతలు త్రవ్విస్తోందని ,ప్రజలు ప్రభుత్వం అందిస్తున్న సహకారం తో లబ్ధి పొందాలని అన్నారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA