Banswada: బాన్సువాడలో నాటుబాంబు పేలుడు: వ్యక్తి మృతి
Banswada: బాన్సువాడ పరిధిలోని తాడుకోలు రాజారాం దుబ్బ కాలనీలో నాటుబాంబుల పేలుడులో తీవ్రంగా గాయపడిన కడమంచి రమేష్ నిజామాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Banswada: బాన్సువాడలో నాటుబాంబు పేలుడు: వ్యక్తి మృతి
బాన్సువాడ: బాన్సువాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని తాడుకోలు గ్రామ పంచాయతీ రాజారాం దుబ్బ కాలనీ లో 01.11.2026 తేదీన అడవి పందుల వేటకు వెళ్లేందుకు నాటుబాంబులు సిద్ధం చేస్తుండగా పేలుడు సంభవించింది.
ఈ ఘటనలో కడమంచి రమేష్‌తో పాటు పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన కడమo చీ రమేష్‌ను మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ 07.11.2026 తేదీన ఉదయం 05:55 గంటలకు మృతి చెందాడు.
జనావాసాల మధ్య నాటుబాంబులను తయారు చేసి, నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు విచారణలో వెల్లడైదని,ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సీ ఐ తెలిపారు.
ప్రజలకు పోలీసుల విజ్ఞప్తి: నాటుబాంబులు, పేలుడు పదార్థాలను తయారు చేయడం, నిల్వ చేయడం, వినియోగించడం చట్టరీత్యా నేరం. ఇలాంటి ప్రమాదకర చర్యలకు ఎవరూ పాల్పడవద్దు. సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలనీ స్టేషన్ హౌస్ ఆఫీసర్ పిఎస్ బాన్సువాడ తుల శ్రీధర్ కోరారు.




