Banswada: బాన్సువాడ జూనియర్ సివిల్ జడ్జి మానవత్వం!

Banswada: కామారెడ్డి జిల్లా బాన్సువాడ జూనియర్ సివిల్ జడ్జి వినీల్ కుమార్ రోడ్డు ప్రమాద బాధితుల వద్దకు వచ్చి మాట్లాడి మానవత్వాన్ని చాటుకున్నారు.

SALEEM, BANSWADA
Published on: 10 Oct 2026 11:41 AM IST
Banswada
X

Banswada: బాన్సువాడ జూనియర్ సివిల్ జడ్జి మానవత్వం!

Banswada: బాన్సువాడ జూనియర్ సివిల్ జడ్జి వినీల్ కుమార్ మానవత్వాన్ని చాటుకున్నారు.బాన్సువాడ కోర్టుకు ఒక కేసు విషయంలో అంబులెన్స్ లో వచ్చిన క్షతగాత్రుల వద్దకు వెళ్లి మాట్లాడారు. వివరాల ప్రకారం నసుల్రాబాద్ మండలం దుర్కి గ్రామానికి చెందిన పురం సందీప్ కుమార్ అతని మిత్రుడు గత ఆగస్టు నెల 25వ తేదీన బాన్సువాడ నుండి గాంధారి వైపుకు వెళుతుండగా మార్గమధ్యలో కృష్ణా నగర్ తండా వద్ద ఎదురుగా వస్తున్న కారు బలంగా ఢీకొంది.

ఈ ప్రమాదంలో సందీప్ కుమార్ అతని మిత్రుడికి తీవ్ర గాయాలై కాళ్లు విరిగాయి. క్షతగాత్రులను వెంటనే బాన్సువాడ ప్రభుత్వాసుపత్రికి అనంతరం మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్ తరలించారు. క్షతగాత్రులకు అవసరమైన వైద్య చికిత్సలు, ఆరోగ్య చికిత్సలు, ఇతరత్రా బాగోగులు తానే చూసుకుంటానని కారు యజమాని ఒప్పుకోవడంతో క్షతగాత్ర బాధిత కుటుంబాలు రాజీకుదుర్చుకున్నాయి.

ఈ మేరకు కారు యజమాని మరియు క్షతగాత్రులు బాన్సువాడ కోర్టుకు అంబులెన్స్ లో రాగా, విషయం తెలుసుకున్న జడ్జి వినీల్ కుమార్ తన ఛాంబర్ క్షతగాత్రుల వద్దకు వచ్చి నుండి మాట్లాడారు. రాజీ కుదుర్చుకోవడం మంచి పరిణామం అని అభిప్రాయపడ్డారు. క్షతగాత్రులు పూర్తిగా కోలుకొని, ఆరోగ్య పరిస్థితి మెరుగుపడే వరకు వైద్య మరియు ఆరోగ్య పరీక్షలు దగ్గరుండి జరిపించాలని వారి బాగోగులు చూసుకోవాలని కారు యజమానిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఖలీల్, న్యాయవాదులు రమాకాంతరావు, భూషణ్ రెడ్డి, దత్తాత్రేయ, లక్ష్మారెడ్డి, మోహన్ రెడ్డి, హమీద్, అజీమ్ హర్షద్, గంగాధర్, సుధీర్ కుమార్ మరియు కోర్టు సిబ్బంది ఉన్నారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA