Banswada: బాన్సువాడ ఆస్పత్రిలో కంటతడి పెట్టించిన ఘటన

Banswada: బాన్సువాడ ఏరియా ఆస్పత్రిలో తల్లి మరణంతో అనాథలైన ఇద్దరు పిల్లలను ఇతర మహిళలు ఓదార్చి అన్నం తినిపించారు. జమా మసీదు కమిటీ అంత్యక్రియలు నిర్వహించింది.

SALEEM, BANSWADA
Published on: 30 Oct 2026 8:45 PM IST
Banswada
X

Banswada: బాన్సువాడ ఆస్పత్రిలో కంటతడి పెట్టించిన ఘటన

బాన్సువాడ: బాన్సువాడ ఏరియా ఆసుపత్రిలో చంద్ బీ అనే మహిళ అనారోగ్యం తో మృతి చెందింది.తల్లి మృతి తో కన్నీరు మున్నీరూ గా ఉన్న ఇద్దరు కూతుళ్ల ను చూసి పలువురు కన్నీళ్లు పెట్టుకున్నారు.మానవత్వానికి మతం అడ్డుకాదు అని నిరూపించారు అక్కడ ఉన్న కొంత మంది మహిళలు.

తల్లి చనిపోయినప్పుడు ఇద్దరు కూతుర్లు తప్ప ఎవరు బంధువులు లేరు. వారికి మేమున్నాం అని ధీమాను ఇచ్చారు ఇతర మహిళలు. మతం వేరు అయినా కొంత మంది మహిళలు ఆ అనాథ బాలికలకు తన కూతుర్ల లాగ ఓదార్చారు అంతే కాకుండా, వారిని అన్నం తినిపించారు.

చూసిన వారికి ఈ ఘటన కన్నీటిని తెప్పించింది. ఈ ఘటన శుక్రవారం బాన్సువాడ ఏరియా ఆసుపత్రిలో జరిగింది.బిచ్కుంద మండలం కందర్ పల్లికి చెందిన చాంద్ బీ (35) అనే మహిళ కడుపు నొప్పితో ఏరియా ఆసుపత్రిలో చేరగా, చికిత్స పొందుతూ మృతి చెందింది.గత సంవత్సరం చంద్ బీ భర్త సయ్యద్ సలీం పాము కాటు తో మృతి చెందాడు.

భర్త చనిపోయిన నుండి కూలి పని చేస్తూ ఇద్దరు కూతుర్లు నాజీమా, ముంతాజ్ లను పెంచి పోషించేది.అనారోగ్యం తో చంద్ బీ మృతి చెందడంతో ఇద్దరు పిల్లలు అనాధులయ్యారు.ఇతర బంధువులు ఎవరూ లేకపోవడంతో, ఆమె మృతదేహం అంత క్రియలకు అయ్యే ఖర్చులు భరిస్తూ, మృత దేహనితో పాటు గ్రామానికి వెళ్లి అంతక్రియలు చేయించి, మానవత్వం చాటుకున్నారు జమ మసీదు కమిటీ సభ్యులు.వారు చూపిన మానవత్వానికి అందరూ ప్రశంసించారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA