Banswada: బాన్సువాడలో దీక్షా దివస్ కాంగ్రెస్‌పై బాజిరెడ్డి ఫైర్

Banswada: కామారెడ్డి జిల్లా బాన్సువాడలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో దీక్షా దివస్ సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడారు.

SALEEM, BANSWADA
Published on: 29 Nov 2026 4:50 PM IST
Banswada
X

Banswada: బాన్సువాడలో దీక్షా దివస్ కాంగ్రెస్‌పై బాజిరెడ్డి ఫైర్

బాన్సువాడ: బాన్సువాడ పట్టణం లోని భారత్ గార్డెన్ లొ బీ ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యం లో దీక్ష దివస్ స్పూర్తి సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజి ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పాల్గొన్నారు.తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కే సీ ఆర్ ప్రాణాన్ని పణం పెట్టీ, నిరాహార దీక్ష చేసిన ఫలితంగానే స్వరాష్ట్రం ప్రత్యేక తెలంగాణ ఏర్పడిందని బాజిరెడ్డి అన్నారు.ప్రస్తుతము కాంగ్రెస్ పాలన ఆధ్వానంగా ఉందని,కాంగ్రెస్ ప్రభుత్వం పై దుయ్య బెట్టారు.

కే సీ ఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలను అమలు చెయ్యడం కాంగ్రెస్ కు చేతకావడం లేదని అన్నారు.ఈ కార్యక్రమం లో బీ ఆర్ ఎస్ నాయకులు మోరిల్ శ్రీనివాస్ రావు,దుద్దాల అంజిరెడ్డి,నార్ల రత్నకుమార్ సెట్,డాక్టర్ హకీమ్,సర్పంచ్ లు, అన్ని మండలాల నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA