Banswada: ప్రశాంతంగా దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలి

Banswada: బాన్సువాడలో డీఎస్పీ విఠల్ రెడ్డి అధ్యక్షతన దుర్గామాత నవరాత్రి ఉత్సవాల శాంతి కమిటీ సమావేశం. డీజేలపై నిషేధం, పోలీసుల మార్గదర్శకాలు జారీ.

SALEEM, BANSWADA
Published on: 10 Oct 2026 8:44 PM IST
Banswada
X

Banswada: ప్రశాంతంగా దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలి

బాన్సువాడ: బాన్సువాడ పోలీస్ స్టేషన్‌లో డీఎస్పీ బి. విట్టల్ రెడ్డి అధ్యక్షతన దుర్గామాత దేవీ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాల నిర్వహణపై శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బాన్సువాడ రూరల్ సర్కిల్ సీఐ తిరుపయ్య, ఎస్‌ఐలు టి. వెంకటరావు, పి. శిరీషతో పాటు వివిధ దుర్గామాత మండపాల నిర్వాహకులు సుమారు 60 మంది పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డీఎస్పీ విఠల్ రెడ్డి మాట్లాడుతూ, ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు. డీజేలకు ఎలాంటి అనుమతి లేదని, డీజేలు ఏర్పాటు చేయకూడదని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా అధిక శబ్దంతో సౌండ్ సిస్టమ్‌లు వినియోగించకూడదని, నిమజ్జన ఊరేగింపులను నిర్ణీత మార్గాల్లో నిర్వహిస్తూ, వదంతులను నమ్మకుండా పోలీసులకు సహకరించాలని అన్నారు.

దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలనీ సూచించారు. డీజే నిషేధ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలనీ,భక్తులకు, ప్రజలకు , సూచించారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని బాన్సువాడ పోలీసులు కోరారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA