Madnoor: మద్నూర్‌లో గణేష్ శోభాయాత్ర మార్గాన్ని పరిశీలించిన డీఎస్పీ!
Madnoor: మద్నూర్‌లో గణేష్ నిమజ్జన శోభాయాత్ర మార్గాన్ని పరిశీలించిన బాన్సువాడ డీఎస్పీ విఠల్ రెడ్డి. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు, శాఖల సమన్వయానికి ఆదేశం.
Madnoor: మద్నూర్‌లో గణేష్ శోభాయాత్ర మార్గాన్ని పరిశీలించిన డీఎస్పీ!
మద్నూర్: గణేష్ నిమజ్జనోత్సవాల సందర్భంగా కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలో నిమజ్జన శోభాయాత్ర వెళ్లే మార్గాన్ని బాన్సువాడ డీఎస్పీ విఠల్ రెడ్డి పరిశీలించారు. నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నిర్వహించేందుకు చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లను ఆయన పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా పోలీస్, ఫైర్ సిబ్బంది, విద్యుత్ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ నిమజ్జన మార్గంలో అవసరమైన అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా విద్యుత్ తీగలు, ట్రాఫిక్ నియంత్రణ, అగ్నిప్రమాద నివారణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
గణేష్ నిమజ్జన శోభాయాత్ర సజావుగా జరిగేలా పటిష్ట బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని పోలీసు సిబ్బందికి డీఎస్పీ విఠల్ రెడ్డి ఆదేశించారు. భక్తులు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు పోలీసు శాఖకు పూర్తి సహకారం అందించి నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా విజయవంతం చేయాలని ఆయన కోరారు.కార్యక్రమం లో గణేష్ మండల్ల నిర్వాహకులు, మద్నూర్ తహసీల్దార్ ముజీభోద్దిన్,బిచ్కుంద సి ఐ రవి కుమార్, మద్నూర్ ఎస్సై మోహన్ రెడ్డి, బిచ్కుంద ఎస్సై గుండెల రాజు తదితరులు పాల్గొన్నారు.




