Banswada: బాన్సువాడలో కన్నులపండువగా దసరా: రావణ దహనం!
Banswada: కామారెడ్డి జిల్లా బాన్సువాడ జయశంకర్ స్టేడియంలో దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
Banswada: బాన్సువాడలో కన్నులపండువగా దసరా: రావణ దహనం!
బాన్సువాడ: కామారెడ్డి జిల్లా బాన్సువాడలో విజయదశమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు.ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.స్థానిక జయ శంకర్ స్టేడియం లో ఏర్పాటు చేసిన కార్యక్రమం ప్రజలకు బాగా లహరించింది.ఏర్పాటు చేసిన టపాకాయలు,బాన సంచాలు,రంగు రంగుల వెలుగులు ,కాంతులు,అందరినీ ఆకట్టుకున్నాయి.అనంతరం రావణ దహనం జరిగింది.
ఈ కార్యక్రమంలో పోచారం కుటుంబ సభ్యులతో పాటు, మున్సిపల్ చైర్మెన్ కాసుల విజయ,ఆగ్రోస్ మాజీ చైర్మెన్ కాసుల బాల రాజు,అడిషనల్ డీ జీ పీ సుదర్శన్,డీ సీ హెచ్ ఓ డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్,మాజీ మున్సిపల్ చైర్మెన్ జంగం గంగాధర్,మాజీ డీ సీ సీ బీ చైర్మెన్ భాస్కర్ రెడ్డి, సొసైటీ అధ్యక్షులు ఏర్వాల కృష్ణ రెడ్డి,మున్సిపల్ కౌన్సిలర్లూ, కాసుల రోహిత్,హకీమ్,నర్సుగొండ, వాoకర్ రమేష్, గౌస్,తదితరులు పాల్గొన్నారు.




